వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ‘బండారు’ ప్రచారం

ABN , First Publish Date - 2022-04-10T05:39:02+05:30 IST

జీవీఎంసీ 94వ వార్డులో వేపగుంట బీసీ కాలనీ, ముత్యాలమ్మకాలనీలో టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శనివారం పాదయాత్ర నిర్వహించారు.

వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ‘బండారు’ ప్రచారం
వేపగుంట బీసీ కాలనీలో బండారుకు స్వాగతం పలుకుతున్న మహిళలు

వేపగుంట, ఏప్రిల్‌ 9: జీవీఎంసీ 94వ వార్డులో వేపగుంట బీసీ కాలనీ, ముత్యాలమ్మకాలనీలో టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శనివారం పాదయాత్ర నిర్వహించారు. వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజలను చైతన్యపరిచేందుకు ఆయన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో మహిళలు ఆయనకు స్వాగతం పలికారు.   కాలనీలో ఇంటింటికీ బండారు  తిరిగి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పన్నులకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం బండారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఇంటి, చెత్త పన్నులతోపాటు కరెంట్‌ చార్జీలు పెంచి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్‌ బల్ల రశ్రీనివాసరావు, టీడీపీ నాయకులు శేశెట్టి అప్పారావు, గంట్ల దేముడు, అప్పలరాజు, జి.సూరిబాబు, దమర్‌సింగ్‌ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Read more