-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Badude Badudu in Pedakodapally-NGTS-AndhraPradesh
-
పెదకోడాపల్లిలో బాదుడే బాదుడు
ABN , First Publish Date - 2022-04-24T06:52:33+05:30 IST
మండలంలో పెదకోడాపల్లిలో శనివారం తెలుగుదేశం పార్టీ నేతలు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు.

పెదబయలు, ఏప్రిల్ 23: మండలంలో పెదకోడాపల్లిలో శనివారం తెలుగుదేశం పార్టీ నేతలు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువులు, చమురు ధరలు, విద్యుత్, బస్ చార్జీలను పెంచేసి సామాన్యుడు బతక లేకుండా చేస్తుందని టీడీపీ నేతలు విమర్శించారు. పెదకోడాపల్లిలో ఇంటింటికీ వెళ్లి వైసీపీ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు లైసాబు త్రినాథ్, పాంగి నాగేశ్వరరావు, కూడ భూషణరావు, బి.రామారావు, బి.అప్పారావు పాల్గొన్నారు.