ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన ర్యాలీ

ABN , First Publish Date - 2022-09-17T06:00:03+05:30 IST

ప్లాస్టిక్‌ వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ ఎంపీడీఓ వెంకన్నబాబు ఆధ్వర్యంలో శుక్రవారం రావికమతంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు.

ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన ర్యాలీ
రావికమతంలో మానవహారంగా ఏర్పడ్డ అంగన్‌వాడీ కార్యకర్తలు


రావికమతం, సెప్టెంబరు 16 : ప్లాస్టిక్‌ వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ ఎంపీడీఓ వెంకన్నబాబు ఆధ్వర్యంలో శుక్రవారం రావికమతంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులైన కవర్లు, గ్లాసులు, స్ర్టాలు వంటివి పర్యావరణానికి హాని చేస్తున్నాయన్నారు. అక్టోబరు రెండవ తేదీ నుంచి మండలంలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పాతాళ సత్యారావు పాల్గొన్నారు. 

Read more