దళితులు, గిరిజనులపై దాడులను అరికట్టాలి

ABN , First Publish Date - 2022-10-05T06:12:09+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా దళితులు, గిరిజనులపై నిత్యం జరుగుతున్న దాడులను అరికట్టాలని కేవీపీఎస్‌ మండల నాయకులు ఈరెల్లి చిరంజీవి అన్నారు.

దళితులు, గిరిజనులపై దాడులను అరికట్టాలి
చిరంజీవి


కేవీపీఎస్‌ నాయకుడు ఈరెల్లి చిరంజీవి 

రోలుగుంట, అక్టోబరు 4: రాష్ట్రవ్యాప్తంగా దళితులు, గిరిజనులపై నిత్యం జరుగుతున్న దాడులను అరికట్టాలని కేవీపీఎస్‌ మండల నాయకులు ఈరెల్లి చిరంజీవి అన్నారు. మంగళవారం ఇక్కడ సంఘం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దాడులు మరింత జరుగుతున్నాయన్నారు. మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ ఘటనలకు పాల్పడుతున్నవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యిందన్నారు. నాన్‌ షెడ్యూల్‌ గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్లో చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె.గోవిందరావు, శ్రీనువాసరావు, శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Read more