-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » ASP Pratibha Awards for Police Personnel-NGTS-AndhraPradesh
-
పోలీస్ సిబ్బందికి ఏఎస్పీ ప్రతిభా పురస్కారాలు
ABN , First Publish Date - 2022-08-31T06:35:29+05:30 IST
స్థానిక పోలీస్ సిబ్బంది ఏఎస్పీ మణికంఠ చందోలు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.

నర్సీపట్నం, ఆగస్టు 30 : స్థానిక పోలీస్ సిబ్బంది ఏఎస్పీ మణికంఠ చందోలు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, నేర విభాగం తదితర అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రతీ మూడు నెలలకు ఒక సారి ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని ఏఎస్పీ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం 17 మంది సిబ్బందికి ఆయన బహుమతులు అందజేశారు. పట్టణ ఎస్‌ఐలు గోవిందరావు, దివాకర్, ధనుంజయనాయుడు, మహిళా పోలీసులు పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ గణేశ్ పాల్గొన్నారు.