అనకాపల్లి మండలం అభివృద్ధికి కంకణం

ABN , First Publish Date - 2022-10-08T06:35:05+05:30 IST

అనకాపల్లి మండలం పూర్తిస్థాయి అభివృద్ధికి కృషిచేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు అధ్యక్షతన శుక్రవా రం ఏర్పాటైన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడారు.

అనకాపల్లి మండలం అభివృద్ధికి కంకణం
సభ్యులనుద్దేశించి మాట్లాడుతున్న మంత్రి అమర్‌నాథ్‌

  సర్వసభ్య సమావేశంలో మంత్రి అమర్‌నాథ్‌ వెల్లడి 

 సమస్యలపై అధికారులకు  పలువురు ప్రశ్నలు

 తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీని ఆధునీకరించాలని కొందరు సభ్యులు విజ్ఞప్తి

తుమ్మపాల/ అనకాపల్లి రూరల్‌, అక్టోబరు 7 : అనకాపల్లి మండలం పూర్తిస్థాయి అభివృద్ధికి కృషిచేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.  ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు అధ్యక్షతన  శుక్రవా రం ఏర్పాటైన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. అనకాపల్లికి సంబం     ధించి ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించినట్టు చెప్పారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్‌ వైద్యాలయంలో వైద్యులు, సిబ్బంది నియామకంపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా వైద్యపరీక్షలు, సదుపాయాలు తదితరాలపై ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని,  త్వరలో అన్నీ సమకూరనున్నట్టు చెప్పారు. మండలంలో అధ్వాన రహదారుల నిర్మాణానికి     చర్యలు చేపడుతున్నామన్నారు. రూ. 32కోట్లతో కొత్తూరు నుంచి కేబీ రోడ్డు, రూ.16 కోట్లతో సుంకరమెట్ట నుంచి శంకరం వరకు రోడ్డు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి మాట్లాడుతూ అనకాపల్లి మండల అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి రూ. 20లక్షలు వెచ్చించనున్నట్టు  ప్రకటించారు. 

సమస్యలపై సభ్యులు గళం

అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు మండలంలో సమస్యల పట్ల అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. పలుచోట్ల ప్రారంభమైన ప్రభుత్వ భవనాలు పూర్తికాక పోవ       డంతో ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. కనీసం రైతు భరోసా కేం ద్రాల కరెంటు బిల్లులు సైతం చెల్లించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు. తుమ్మపాల చక్కె ర కర్మాగారాన్ని ఆధునీకరించాలని    పలువురు ప్రజాప్రతినిధులు  కోరారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. పలు శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వలంటీర్ల తీరు అధ్వానంగా ఉందని పలు వురు ఆవేదన వ్యక్తం చేశారు.  అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయానికి సభ్యులంతా మద్దతు ఇస్తున్నట్టు మంత్రి సమక్షంలో వెల్లడించారు. గ్రామాల్లో  సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు ఎంపీపీ సూరిబాబు తెలిపారు. సమావేశానికి హాజరుకాని అధికారుల అంశాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ భీశెట్టి వరహా    సత్యవతి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పలకా యశోధ, వైస్‌ ఎంపీపీ విల్లూరి సూర్యకుమారి, ఎంపీడీవో చంద్రశేఖర్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T06:35:05+05:30 IST