మానవత్వం చాటుకున్న అనకాపల్లి డీఎస్పీ

ABN , First Publish Date - 2022-07-18T06:35:45+05:30 IST

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులను తన వాహనంలో స్థానికుల సహకారంతో ఎక్కించి విశాఖ కేజీహెచ్‌లో చేర్పించి అనకాపల్లి డీఎస్పీ బి. సునీల్‌ మానవత్వాన్ని చాటుకున్నారు.

మానవత్వం చాటుకున్న అనకాపల్లి డీఎస్పీ
గాయపడిన యువకుడ్ని తన వాహనంలో స్థానికుల సాయంతో ఎక్కిస్తున్న డీఎస్పీ సునీల్‌విశాఖలో గాయపడిన వారిని కేజీహెచ్‌కు తరలింపు 

అనకాపల్లిటౌన్‌, జూలై 17: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులను తన వాహనంలో స్థానికుల సహకారంతో ఎక్కించి విశాఖ కేజీహెచ్‌లో చేర్పించి అనకాపల్లి డీఎస్పీ బి. సునీల్‌ మానవత్వాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో ఉన్న తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వంతెనపై ఆదివారం ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు వంతెనపై జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ ప్రమాదాన్ని చూసిన వెంటనే తన వాహనాన్ని ఆపి స్థానికుల సహకారంతో గాయపడిన ముగ్గురి యువకులను తన వాహనంలో ఎక్కించి చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. డీఎస్పీ సునీల్‌ను పలువురు అభినందించారు.

Read more