విద్యార్థులకు శాస్ర్తీయ విజ్ఞానాన్ని అందించే అవకాశం

ABN , First Publish Date - 2022-09-25T06:25:14+05:30 IST

విద్యార్థులకు శాస్ర్తీయ విజ్ఞానాన్ని అందించేలా ప్రదర్శన ఏర్పాటుచేయడం మంచి పరిణామమని ఏయూ రెక్టార్‌ ప్రొఫెసర్‌ కె.సమత పేర్కొన్నారు.

విద్యార్థులకు శాస్ర్తీయ విజ్ఞానాన్ని అందించే అవకాశం
ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవంలో రెక్టార్‌ సమత

జియోలాజికల్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవంలో ఏయూ రెక్టార్‌ సమత  

విశాఖపట్నం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు శాస్ర్తీయ విజ్ఞానాన్ని అందించేలా ప్రదర్శన ఏర్పాటుచేయడం మంచి పరిణామమని ఏయూ రెక్టార్‌ ప్రొఫెసర్‌ కె.సమత పేర్కొన్నారు. శనివారం ఏయూ జియాలజీ విభాగంలో ఏయూ, ఇంటక్‌ విశాఖ సంయుక్తంగా ఇంటర్నేషనల్‌ జియో డైవర్సిటీ దినోత్సవంలో భాగంగా ఏర్పాటుచేసిన జియోలాజికల్‌ ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు. పాఠశాల, కళాశాలలకు చెందిన విద్యార్థులకు నూతన ఆలోచనలను, సమున్నత ఆశాయాలను కలిగించేలా ఈ తరహా ప్రదర్శనలు నిలుస్తాయన్నారు. సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ అరుదైన మినరల్స్‌, శిలలను ప్రదర్శనలో ఉంచారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లభ్యమైన అరుదైన శిలలను విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం  ఈ ప్రదర్శన వల్ల కలిగిందన్నారు.  ఇంటక్‌ విశాఖ కన్వీనర్‌ డి.రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ యునెస్కో ఏటా అక్టోబరు ఆరో తేదీన ఇంటర్నేషనల్‌ జియో డైవర్సిటీగా ప్రకటించిందన్నారు. ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు వివరించారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ఈ తరహా ప్రదర్శనలతో సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి ప్రొఫెసర్‌ కె.సత్యనారాయణరెడ్డి, ప్రొఫెసర్‌ ఇ. ధనుంజయరావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-25T06:25:14+05:30 IST