అమ్మవార్ల వేడుకకు వేళాయె...

ABN , First Publish Date - 2022-08-10T06:25:47+05:30 IST

పట్టణంలోని దాసరిగెడ్డ రోడ్డులో గల సత్తెమ్మతల్లి జాతర బుధవారం జర గనుంది. ఇందుకు సంబంధించి నిర్వా హకులు భారీ ఏర్పాట్లు చేపట్టారు.

అమ్మవార్ల వేడుకకు వేళాయె...
దాసరిగెడ్డ రోడ్డులో కొలువుదిరిన సత్తెమ్మతల్లి

  నేడు దాసరిగెడ్డ రోడ్డులోని సత్తెమ్మతల్లి ఆలయంలో పండగ 

 సతకంపట్టు వద్ద మరిడిమాంబ జాతర రేపు

 భారీ ఏర్పాట్లు చేపడుతున్న నిర్వాహకులు 

 దేవతలకు సారె సమర్పణ 

 సీఐ ఆధ్వర్యంలో  బందోబస్తు

అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 9 : పట్టణంలోని దాసరిగెడ్డ రోడ్డులో గల సత్తెమ్మతల్లి  జాతర బుధవారం జర గనుంది. ఇందుకు సంబంధించి నిర్వా హకులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయి.  సాయం త్రం నేలవేషాలు, తప్పెటగుళ్లు, తోడపెద్దు సేవ, నవశక్తుల డ్యాన్స్‌ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఆడారి నరసింగరావు, దొడ్డి రాముడు, కన్వీనర్‌ ఆడారి అప్పారావు తెలిపారు. రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. పట్టణ సీఐ దాడి మోహనరావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 

కోట్నివీధి మరిడిమాంబకు  సారె  సమర్పణ

అనకాపల్లిటౌన్‌ : స్థానిక కోట్నివీధి మరిడిమాంబకు ఆ ప్రాంత మహి ళలు మంగళవారం సాయంత్రం సారె ను మర్పించారు. గురువారం అమ్మపండగ జరగనున్న సందర్భంగా మహి ళలు తమ ఇళ్ల వద్ద తయారు చేసిన వివిధ రకాల పిండివంటలను తలపై పెట్టుకుని  ఆలయం నుంచి లక్ష్మీనారాయణనగర్‌, కోట్నివీధి, మళ్లవీధి, గాంధీబొమ్మ జంక్షన్‌, భీమునిగుమ్మం మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు.  ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ అప్పికొండ రవిశంకర్‌, కోట్నివీధి పెద్ద లు కోరుకొండ రాఘవ, కరణం శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తలు యువరాజు, రమణ, వాసు, నూకరత్నం, ఈశ్వరమ్మ, దొర  పాల్గొన్నారు.

మరిడిమాంబ జాతర కరపత్రాల ఆవిష్కరణ

అనకాపల్లిటౌన్‌ : సతకంపట్టు వద్ద గల మరిడిమాంబ జాతర గురు వారం జరగనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను నిర్వహ కులు మంగళవారం ఇక్కడ ఆవిష్కరిం చారు. ఈ వేడుకల్లో భాగంగా అమ్మవారికి మహిళలు పసుపు కుంకుమలతో పాటు సారెను సమర్పిం చారు.  ఈ కార్యక్రమంలో పీవీ రమణ, కొణతాల సంతోష్‌అప్పారావునాయుడు, కొణతాల మురళీకృష్ణ, కె.ఎం.నాయుడు, పొలిమేర శ్రీను, ఆళ్ల మధు, బుద్ద సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more