ఫైనల్స్‌కు చేరిన ఏఎంసీ, జీఎస్‌ఎల్‌ జట్లు

ABN , First Publish Date - 2022-09-30T06:16:41+05:30 IST

ఆంధ్ర మెడికల్‌ కాలేజీ నిర్వహిస్తున్న డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ అంతర్‌ వైద్య కళాశాలల పురుషుల ఫుట్‌బాల్‌ టోర్నీ చివరి దశకు చేరింది.

ఫైనల్స్‌కు చేరిన ఏఎంసీ, జీఎస్‌ఎల్‌ జట్లు
ఏఎంసీ క్రీడాకారులతో డాక్టర్‌ ఆదినారాయణ

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ ఫుట్‌బాల్‌ టోర్నీ

విశాఖపట్నం (స్పోర్ట్సు), సెప్టెంబరు 29: ఆంధ్ర మెడికల్‌ కాలేజీ నిర్వహిస్తున్న డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ అంతర్‌ వైద్య కళాశాలల పురుషుల ఫుట్‌బాల్‌ టోర్నీ చివరి దశకు చేరింది.  మేజర్‌ ఎబ్డెన్‌ స్మారక గ్రౌండ్‌లో  గురువారం జరిగిన తొలి సెమీఫైనల్స్‌లో జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజీ (రాజమండ్రి) 2-0 గోల్స్‌ తేడాతో ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీ (గుంటూరు)పై గెలుపొందింది. మరో సెమీస్‌లో ఆతిథ్య ఆంధ్ర మెడికల్‌ కాలేజీ 1-0 గోల్‌ తేడాతో కర్నూలు మెడికల్‌ కాలేజీపై విజయం సాధించింది. గురువారం జరిగే ఫైనల్స్‌లో ఆంధ్ర మెడికల్‌ కాలేజీ (విశాఖ), జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజీ (రాజమండ్రి) జట్లు తలపడనున్నాయి. గురువారం జరిగిన మ్యాచ్‌లకు పద్మశ్రీ డాక్టర్‌ ఎస్‌వీ.ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఫిజికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎంఎస్‌ఎన్‌.పాత్రుడు, తదితరులు పాల్గొన్నారు.


ఫలితాలు:

క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆంధ్ర మెడికల్‌ కాలేజీ 1-0 గోల్‌తో నారాయణ మెడికల్‌ కాలేజీపై, ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీ 3-1 (టై బ్రేకర్స్‌) గోల్స్‌తో విశ్వభారతి మెడికల్‌ కాలేజీపై, కర్నూలు మెడికల్‌ కాలేజీ 1-0 గోల్‌తో కిమ్స్‌పై, జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజీ 3-2 (టై బ్రేకర్స్‌) గోల్స్‌తో అపోలో మెడికల్‌ కాలేజీపై గెలుపొందాయి. 

 


Read more