అడ్డూరులో పూర్వ విద్యార్థుల కలయిక

ABN , First Publish Date - 2022-09-12T05:26:47+05:30 IST

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1999-2002 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం మండలంలోని మజ్జి గౌరమ్మ ఆలయం వద్ద సమావేశమయ్యారు.

అడ్డూరులో పూర్వ విద్యార్థుల కలయిక
అడ్డూరులో కలిసిన పూర్వ విద్యార్థులు


చోడవరం, సెప్టెంబరు 11: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1999-2002 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం మండలంలోని మజ్జి గౌరమ్మ ఆలయం వద్ద సమావేశమయ్యారు. ఎన్నో సంవత్సరాల తరువాత కలిసిన వీరంతా కలిసి చిననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా అప్పటికళాశాల లెక్చరర్‌ వెంకటరావును విద్యార్థులు సత్కరించారు. ఈ సందర్భంగా బీ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అనే సంస్థను స్థాపించాలని నిర్ణయించారు. ఆ సంస్థ ద్వారా ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్‌ జనపాల సాయి ప్రసాద్‌, సానా సతీష్‌, నాగిరెడ్డి సత్యనారాయణ, శనివాడ రమణ, జి. లక్ష ్మణ్‌ల ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆటపాటలతో సందడి చేశారు. 

Read more