ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు అనుమతివ్వండి

ABN , First Publish Date - 2022-04-05T06:27:05+05:30 IST

నగరంలో ఉత్పన్నమవుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి ప్లాస్టిక్‌ వస్తువులు తయారు చేయడానికి తాము సిద్ధంగా వున్నట్టు ఎలియన్‌ టు ప్లాస్టిక్‌ సంస్థ ప్రతినిధి ప్రణవ్‌ గోయిక, తదితరులు జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషాకు తెలిపారు.

ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు అనుమతివ్వండి
సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా

జీవీఎంసీ కమిషనర్‌కు కోరిన సింగపూర్‌కు చెందిన సంస్థ ప్రతినిధులు

వెంకోజీపాలెం, ఏప్రిల్‌ 4: నగరంలో ఉత్పన్నమవుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి ప్లాస్టిక్‌ వస్తువులు తయారు చేయడానికి తాము సిద్ధంగా వున్నట్టు ఎలియన్‌ టు ప్లాస్టిక్‌ సంస్థ ప్రతినిధి ప్రణవ్‌ గోయిక, తదితరులు జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషాకు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆ సంస్థ ప్రతినిధులు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సింగపూర్‌కు చెందిన తమ సంస్థ అనేక నగరాలలో ప్లాస్టిక్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేసిందని, విశాఖ నగరంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన స్టడీ చేయడానికి అనుమతించాలని లక్ష్మీషాను కోరారు. పర్యావరణానికి కీడు చేసే ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ పట్ల అప్రమత్తం అవసరమని పేర్కొన్నారు. అందుకు సానుకూలంగా స్పందించిన కమిషనర్‌ యూనిట్‌ ఏర్పాటుకు త్వరలో నిర్ణయం తీసుకుంటామని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఈవో సూరజ్‌ కుమార్‌, సౌరవ్‌ భాత్రా, జీవీఎంసీ వైద్యాధికారి డాక్టర్‌ కేఎస్‌ఎల్‌ఈ శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు. 


Read more