ఏఐటీయూసీ విజయబావుటా

ABN , First Publish Date - 2022-04-24T07:10:05+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ గుర్తింపు యూనియన్‌ ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం సాధించింది.

ఏఐటీయూసీ విజయబావుటా

స్టీల్‌ప్లాంట్‌ గుర్తింపు యూనియన్‌ ఎన్నికల్లో ఘన విజయం 

ఇంటక్‌పై 459 ఓట్ల మెజారిటీ


ఉక్కుటౌన్‌షిప్‌, ఏప్రిల్‌ 23: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ గుర్తింపు యూనియన్‌ ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం సాధించింది. ఇంటక్‌పై 459 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. విజయం సాధించిన ఏఐటీయూసీకు 3,555 ఓట్లు లభించగా, ఇంటక్‌కు 3,096, సీఐటీయూకు 2,834 ఓట్లు లభించాయి. అలాగే సీవీఎ్‌సడబ్ల్యూకు 29, డీఎ్‌సఈయూకు 214, డీవీఆర్‌ఎ్‌సఈకు 3, బీఎంఎ్‌సకు 104, ఆర్‌ఎ్‌సఈయూకు 16, ఎస్‌పీఈయూకు 4, సీఐటీయూకు 2834, ఇంటక్‌కు 3096, ఏఐటీయూసీకు 3555 ఓట్లు లభించగా 37 ఓట్లు చెల్లలేదు. 


కార్మిక విజయం

ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు కేఎస్‌ఎన్‌ రావు, డి.ఆదినారాయణ

ఇది కార్మిక విజయమని, సంస్థ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేఎ్‌సఎన్‌ రావు, డి.ఆదినారాయణలు పేర్కొన్నారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలో వారు మాట్లాడుతూ, కార్మికులకు ఆర్థిక ప్రయోజనాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.


తెలుగుదేశంలో హర్షం

స్టీల్‌ ఎన్నికల్లో ఏఐటీయూసీకి తెలుగుదేశం అనుబంధ సంఘం టీఎన్‌టీయూసీ సంపూర్ణ మద్దతు పలకడంతో పాటు ఆ పార్టీ నాయకులు ప్రచారం కూడా చేశారు. ఏఐటీయూసీ విజయం పట్ల తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Read more