-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Action should be taken against corruption in DCCB-NGTS-AndhraPradesh
-
డీసీసీబీలో అవినీతిపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-09-10T06:25:34+05:30 IST
డీసీసీబీలో రూ.3 కోట్లు అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా తెలుగురైతు ఆర్గనైజింగ్ కార్యదర్శి అక్కిరెడ్డి రమణబాబు డిమాండ్ చేశారు.

- జిల్లా తెలుగురైతు ఆర్గనైజింగ్ కార్యదర్శి రమణబాబు
అనకాపల్లి అర్బన్, సెప్టెంబరు 9 : డీసీసీబీలో రూ.3 కోట్లు అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా తెలుగురైతు ఆర్గనైజింగ్ కార్యదర్శి అక్కిరెడ్డి రమణబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడి విలేఖర్లతో మాట్లాడుతూ డీసీసీబీలో సీఈవో, జనరల్ మేనేజర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మూడు కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినట్టు 51 ఎంక్వైరీలో తేటతెల్లం అయినప్పటికీ వారిపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గం కూడా ఇంత వరకు సమావేశం ఏర్పాటు చేయకుండా దోషులను కాపాడే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు. సీఈవోకు రిటైర్‌మెంట్ బెన్ఫిట్స్ రూ.కోటి ఇచ్చారని విచారణ కొనసాగుతుండగా ఎటువంటి లావాదేవీలు జరపకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ రిటైర్‌మెంట్ సొమ్ము ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు లోవకృష్ణ, మహాలక్ష్మినాయుడు, మాధవరావు, రామకృష్ణ పాల్గొన్నారు.