అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు

ABN , First Publish Date - 2022-03-23T06:25:37+05:30 IST

వరాహలక్ష్మీనృసింహస్వామికి సహస్రనామ తులసీ దళార్చన, గరుడసేవ, నిత్యకల్యాణం వంటి ఆర్జిత సేవలను మంగళవారం వైభవంగా నిర్వహించారు.

అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
గరుడ సేవ నిర్వహిస్తున్న అర్చకుడు

సింహాచలం, మార్చి 22: వరాహలక్ష్మీనృసింహస్వామికి సహస్రనామ తులసీ దళార్చన, గరుడసేవ, నిత్యకల్యాణం వంటి ఆర్జిత సేవలను మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రభాత సేవలను యథావిధిగా పూర్తి చేశారు. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని కల్యాణ మండపంలోని ప్రత్యేక వేదికపై అధిష్టింపజేసి తొలుత సహస్రనామ తులసీ దళార్చన జరిపారు. అనంతరం స్వామివారి నిత్య కల్యాణాన్ని ఘనంగా జరిపారు. భక్తుల గోత్రనామాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించి సంప్రదాయబద్ధంగా కల్యాణాన్ని జరిపారు. ఆ తర్వాత గోవిందరాజస్వామిని రజిత గరుడ వాహనంపై వుంచి భక్తుల గోత్రనామాలతో గరుడసేవ చేశారు. మంగళవాయిద్యాల నడుమ భక్తులు గరుడ వాహనం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణలు చేశారు.


Read more