స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

ABN , First Publish Date - 2022-11-30T23:48:57+05:30 IST

వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా వున్న స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి అధికారులు బుధవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

జోన్‌-1 పరిధిలోని ఐదు జిల్లాల్లో 106 పోస్టులు

విశాఖపట్నం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా వున్న స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి అధికారులు బుధవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జోన్‌-1 పరిధిలో గల అనకాపల్లి జిల్లాలో 33, విశాఖపట్నం జిల్లాలో మూడు, విజయనగరం జిల్లాలో 11, మన్యం జిల్లాలో 24, శ్రీకాకుళం జిల్లాలో 32, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు...మొత్తం 106 పోస్టులు భర్తీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. వచ్చే నెల ఆరో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2022-11-30T23:48:59+05:30 IST