ఖోఖో పోటీల్లో సీతయ్యపేట హైస్కూల్‌ విద్యార్థుల సత్తా

ABN , First Publish Date - 2022-09-25T06:45:38+05:30 IST

మండలంలోని సీతయ్యపేట జడ్పీ హైస్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు.

ఖోఖో పోటీల్లో సీతయ్యపేట హైస్కూల్‌ విద్యార్థుల సత్తా
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన విద్యార్థులతో ఎంపీపీ, హెచ్‌ఎం, తదితరులు రాష్ట్రస్థాయి పోటీలకు ఐదుగురు ఎంపిక 

బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 24: మండలంలోని సీతయ్యపేట జడ్పీ హైస్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. తుమ్మపాలలో నిర్వహించిన విశాఖ జిల్లా ఖోఖో  అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో సీతయ్యపేట హైస్కూల్‌కి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. దీంతో ఈనెల 23 నుంచి 28 వరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరగనున్న 32వ రాష్ట్రస్థాయి  సబ్‌ జూనియర్‌ బాల, బాలికల ఖోఖో జట్లకు బి.లోకేష్‌, బి.చైతన్య, ఎస్‌.దుర్గాప్రసాద్‌, పి.శ్రేయ, బి.రోహిణి ఎంపికయ్యారని  పీఈటీ దాడి శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఎంపీపీ దాకవరపు నాగేశ్వరిదేవి, సర్పంచ్‌ వజ్రపు ఇందిర, హెచ్‌ఎం ఏవీ.జగన్నాథరావు, విద్యాకమిటీ చైర్మన్‌ వజ్రపు బాబురావు అభినందించారు.


Read more