ఆ రూ.3 కోట్ల నగదు న్యాయస్థానానికి బదిలీ

ABN , First Publish Date - 2022-05-18T06:01:31+05:30 IST

మండలంలోని వేంపాడు హైవే టోల్‌ప్లాజా వద్ద సోమవారం పోలీసులు పట్టుకున్న రూ.3 కోట్ల నగదును న్యాయస్థానానికి సమర్పించనున్నట్టు సీఐ వి.నారాయణరావు తెలిపారు.

ఆ రూ.3 కోట్ల నగదు న్యాయస్థానానికి బదిలీ


నక్కపల్లి, మే 17: మండలంలోని వేంపాడు హైవే టోల్‌ప్లాజా వద్ద సోమవారం పోలీసులు పట్టుకున్న రూ.3 కోట్ల నగదును న్యాయస్థానానికి సమర్పించనున్నట్టు సీఐ వి.నారాయణరావు తెలిపారు. టోల్‌ప్లాజా వద్ద సోమవారం తమ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కారులో రూ.3 కోట్ల నగదు బయటపడిందని చెప్పారు. దీనికి సంబంధించి కారు డ్రైవర్‌, నగదు తీసుకువెళ్తున్న వ్యక్తి ఎటువంటి ఆధారాలు చూపించలేదన్నారు. దీంతో నగదు, కారును స్వాధీనం చేసుకుని, తదుపరి చర్యల నిమిత్తం కోర్టుకు సమర్పిస్తామని ఆయన చెప్పారు. 

Read more