రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-10-03T06:11:00+05:30 IST

జాతీయ రహదారిని ఆనుకుని వున్న విశాఖ డెయిరీ సమీపంలో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మృతి చెందిన సతీశ్‌కుమార్‌

మృతుడి స్వస్థలం విజయనగరం జిల్లా వేపాడ మండలం

అక్కిరెడ్డిపాలెం, అక్టోబరు 2: జాతీయ రహదారిని ఆనుకుని వున్న విశాఖ  డెయిరీ సమీపంలో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా వేపాడ మండలం వెల్లిపర్తి గ్రామానికి చెందిన కనుకూరి సతీశ్‌కుమార్‌ (30) ఆదివారం వేకువజామున మూడు గంటలప్పుడు గాజువాక నుంచి ఎన్‌ఏడీ వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా కాకినాడ నుంచి విశాఖ వస్తున్న ఆర్టీసీ బస్సు వెనక నుంచి బలంగా ఢీకొంది. దీంతో సతీశ్‌కుమార్‌ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సతీశ్‌కుమార్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Read more