-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » A white paper should be released on the development of Visakhapatnam-NGTS-AndhraPradesh
-
విశాఖ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ABN , First Publish Date - 2022-09-27T07:03:53+05:30 IST
వికేంద్రీకరణ పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి రాష్ట్రాభివృద్ధిని ప్రభు త్వం గాలికి వదిలేసిందని టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు సోమవారం ఆరోపించారు.

పాలన వికేంద్రీకరణ పేరుతో మాయమాటలు
రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్ ఫైర్
అనకాపల్లి అర్బన్, సెప్టెంబరు 26 : వికేంద్రీకరణ పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి రాష్ట్రాభివృద్ధిని ప్రభు త్వం గాలికి వదిలేసిందని టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు సోమవారం ఆరోపించారు. విశాఖ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి బిల్డ్ ఏపీ పేరుతో దోచుకున్న భూములు అనేకం ఉన్నప్పటికీ అభివృద్ధి చేసిన దాఖలాలేమీ లేవన్నారు. విశాఖపట్నంలో ప్రభుత్వ భూములను, భవనాలను బ్యాంకులకు తాకట్టు పెట్టి విశాఖ పేరును చెడగొట్టారని మండిపడ్డారు. గంగవరం పోర్టును కారుచౌకగా అదానీకి అమ్మేశారని ఆరోపించారు. సుమారు మూడు నెలలుగా బెంగాల్ టైగర్ అన కాపల్లి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అనేక మూగజీవాలను బలి తీసుకుంటున్నా దానిని పట్టుకోవడంతో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.