ఆదివాసుల మనుగడకు ముప్పు

ABN , First Publish Date - 2022-12-12T00:54:10+05:30 IST

ఇతర కులాలకు చెందిన వారిని గిరిజనుల జాబితాలో చేర్చితే ఆదివాసుల మనుగడకే ముప్పు వాటిల్లుతుందని అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు మధుకర్‌ ఉయికే ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఆదివారం నిర్వహించిన ఆదివాసీ ఉద్యోగుల జాతీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సమాజంలో అణగారిన వర్గంగా ఉన్న ఆదివాసుల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన పాలకులు, అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఆదివాసీల మనుగడకు ముప్పువాటిల్లే చర్యలు చేపట్టడం ఘోరమన్నారు.

ఆదివాసుల మనుగడకు ముప్పు
మాట్లాడుతున్న జాతీయ అధ్యక్షుడు మధుకర్‌ ఉయికే

- ఎస్‌టీ జాబితాలో ఇతరులను చేర్చితే నష్టమే..

- అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు మధుకర్‌ ఉయికే

పాడేరు, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఇతర కులాలకు చెందిన వారిని గిరిజనుల జాబితాలో చేర్చితే ఆదివాసుల మనుగడకే ముప్పు వాటిల్లుతుందని అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు మధుకర్‌ ఉయికే ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఆదివారం నిర్వహించిన ఆదివాసీ ఉద్యోగుల జాతీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సమాజంలో అణగారిన వర్గంగా ఉన్న ఆదివాసుల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన పాలకులు, అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఆదివాసీల మనుగడకు ముప్పువాటిల్లే చర్యలు చేపట్టడం ఘోరమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీసీలుగా ఉన్న బోయవాల్మీకులను, ఇతర కులాలను ఎస్‌టీ జాబితాలో చేర్పించేందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం జీవో: 52 ద్వారా ఏకసభ్య కమిషన్‌ వేసిందన్నారు. ఇటువంటి చర్య వల్ల ఆదివాసీలు ఉనికి కోల్పోతారన్నారు. అలాగే జీవో: 3 రద్దుతో ఆదివాసీలు ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో ఉన్న ఆదివాసీలను రెగ్యులర్‌ చేయకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆదివాసుల హక్కులు, చట్టాల పరిరక్షణకు పాలకులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాతీయ అధ్యక్షుడు మధుకర్‌ ఉయికే అభిప్రాయపడ్డారు. అలాగే జీవో: 3 రద్దు, బోయవాల్మీకులను ఎస్‌టీ జాబితాలో చేర్చడం, షెడ్యూల్‌ ప్రాంతాల్లో నాన్‌ట్రైబల్స్‌కు ఇళ్ల స్థలాల జారీ, నకిలీ ఎస్‌టీ సర్టిఫికెట్‌ల రద్దు తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆదివాసీల సమస్యలపై ఈ నెల 30న పాడేరులో ’ఆదివాసీ గర్జన’ పేరిట నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆదివాసీ నేతలు ఆవిష్కరించారు. అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మార్కెండేయ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావే శంలో ఏపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చిట్టపుల్లి శ్రీనివాస్‌పడాల్‌, నేతలు సోమెలి చిట్టిబాబు, జి.సోంబాబు, కె.మల్లేశ్వరరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్‌ కోకోడే, మహారాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దేవా పవార్‌, ఛ త్తీస్‌గఢ్‌ నేత సాచేసింగ్‌, వివిధ రాష్ట్రాల నేతలు ఈశ్వర్‌దుర్వే, జితేందర్‌ దుర్వే, లక్ష్మణ్‌బాఘా గట్కార్‌, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T00:54:10+05:30 IST

Read more