-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » A popular dance festival-NGTS-AndhraPradesh
-
జనరంజకంగా నృత్యోత్సవం
ABN , First Publish Date - 2022-09-19T07:02:35+05:30 IST
విశాఖ నగరం పిఠాపురంకాలనీ కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం రెండో రోజు నిర్వహించిన వైశాఖీ నృత్యోత్సవాలు జనరంజకంగా కొనసాగాయి.

విశాఖపట్నం, సెప్టెంబరు 18: విశాఖ నగరం పిఠాపురంకాలనీ కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం రెండో రోజు నిర్వహించిన వైశాఖీ నృత్యోత్సవాలు జనరంజకంగా కొనసాగాయి. కూచిపూడి, భరతనాట్యం, మోహినీయాట్టం ప్రదర్శనలు కళాభిమానుల నీరాజనాలందుకున్నాయి. శ్రీరంజని రాగం. ఆదితాళంలో పాపనాశని సదాశివన్ గణేశ్ స్తుతి గానానికి హాంగ్‌కాంగ్ కళాకారిణి చేసిన భరతనాట్యానికి కళాప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. మీరాభాయి భజనకు చక్కటి అభినయంతో రూప భరతనాట్య ప్రదర్శన మైమరిపించింది. తమిళనాడు, ఒడిశా కళాకారులు చేసిన నృత్యాలు కనువిందు చేశాయి. కేరళ కళాకారిణి అనుపమ మోహన్ కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. హైదరాబాద్ నిర్మల పరికల్పన విద్యార్థులు ప్రదర్శించిన మహిషాసుర మర్దని వృక్షరూపకాకిఇ హర్షద్వానాలు మిన్నంటాయి.