కొబ్బరిచెట్టుతో పాటు పడి కూలీ దుర్మరణం

ABN , First Publish Date - 2022-09-10T06:34:21+05:30 IST

మృత్యువు ..ఎప్పుడెవరిని ఎలా కాటేస్తుందో ఊహించడం కష్టమే. కొబ్బరి వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న కూలీని అదే కొబ్బరి చెట్టు మృత్యువుగా కబళించింది.

కొబ్బరిచెట్టుతో పాటు పడి కూలీ దుర్మరణం
మృతుడు చినబాబ్జీ( ఫైల్‌)

నక్కపల్లి, సెప్టెంబరు 9 : మృత్యువు ..ఎప్పుడెవరిని ఎలా కాటేస్తుందో ఊహించడం కష్టమే. కొబ్బరి వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న కూలీని అదే కొబ్బరి చెట్టు మృత్యువుగా కబళించింది.  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివి. ఎస్‌.రాయవరానికి చెందిన వీర్ల చిన బాబ్జీ (65)కొబ్బరి దింపుడు కూలీగా పనిచేస్తుంటాడు. శుక్రవారం రాజయ్యపేటలో  కొబ్బరిచెట్టు నుంచి కాయలు తీస్తుండగా చెట్టు మొదలు విరిగిపోవడంతో చెట్టుతో పాటు, చెట్టుపై ఉన్న బాబ్జీ కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more