పాఠశాలపై విరిగిపడ్డ భారీ వృక్షం

ABN , First Publish Date - 2022-04-24T06:51:26+05:30 IST

ఈదురు గాలులకు పాఠశాల భవనంపై భారీ వృక్షం పడింది.

పాఠశాలపై విరిగిపడ్డ భారీ వృక్షం
సంగోడి పాఠశాలపై పడిపోయిన వృక్షం


పాడేరురూరల్‌, ఏప్రిల్‌ 23: ఈదురు గాలులకు పాఠశాల భవనంపై భారీ వృక్షం పడింది. మండలంలోని మినుములూరు పంచాయతీ సంగోడిలో శనివారం సాయంత్రం ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఆ సమయంలో  మండలపరిషత్‌ పాఠశాలపై భారీ వృక్షం పడడంతో భవనం దెబ్బతింది. ఆ సమయంలో పిల్లలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని తల్లిదండ్రులు తెలిపారు. అధికారులు స్పందించి భవనాన్ని మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.


Read more