అబ్బురపరిచిన జియోలాజికల్‌ ఎగ్జిబిషన్‌

ABN , First Publish Date - 2022-09-25T06:28:30+05:30 IST

వేల ఏళ్ల చరిత్ర కలిగిన భూమి, భిన్న జంతు, జీవ రాశుల గురించి అవగాహన కల్పించేందుకు వీలుగా ఆంధ్రవిశ్వవిద్యాలయం జియాలజీ విభాగం ఆధ్వర్యంలో శనివారం ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్‌ జియో డైవర్సిటీని పురస్కరించుకుని జియాలజీ విభాగం, ఇంటక్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో వేల ఏళ చరిత్ర కలిగిన శిలాజాలను ఏర్పాటుచేశారు. ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు నగర పరిధిలోని అనేక పాఠశాలలు, కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారు.

అబ్బురపరిచిన జియోలాజికల్‌ ఎగ్జిబిషన్‌
ప్రదర్శనను తిలకిస్తున్న వివిధ పాఠశాలల విద్యార్థులు

భూ వైవిధ్యాన్ని తెలిపేలా ప్రదర్శన 

ఏయూ జియాలజీ విభాగం, ఇంటక్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు

 ప్రజలు, విద్యార్థుల్లో అవగాహన కల్పించడమే ధ్యేయం

 ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు భారీగా వచ్చిన విద్యార్థులు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి) 

వేల ఏళ్ల చరిత్ర కలిగిన భూమి, భిన్న జంతు, జీవ రాశుల గురించి అవగాహన కల్పించేందుకు వీలుగా ఆంధ్రవిశ్వవిద్యాలయం జియాలజీ విభాగం ఆధ్వర్యంలో శనివారం ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్‌ జియో డైవర్సిటీని పురస్కరించుకుని జియాలజీ విభాగం, ఇంటక్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో వేల ఏళ చరిత్ర కలిగిన శిలాజాలను ఏర్పాటుచేశారు. ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు నగర పరిధిలోని అనేక పాఠశాలలు, కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారు.   


జియో టూరిజంపై.. 

భూమిలోని ప్రతి ప్రాంతం వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. విశాఖ భిన్న వైవిద్యాలతో కూడిన ప్రాంతం. ఒకపక్క సముద్ర తీరం, మరోపక్క ఎర్ర మట్టి దిబ్బలు,  ఇంకో పక్క బొర్రాగుహలు. ఈ వైవిధ్యాన్ని ఆస్వాదించడంతోపాటు ఆయా ప్రాంతాలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. వీటితోపాటు జియో హెరిటేజ్‌ సైట్స్‌గా గురించిన ప్రాంతాల చిత్రాలు, కోస్టల్‌ లైన్‌ వంటి విషయాలను చిత్రాలతో ఇక్కడ ప్రదర్శించారు. ఆయా ప్రాంతాలు, ప్రత్యేకతలు విభాగంలోని విద్యార్థులు వివరించారు. భూమిపై ప్రధానంగా ఇగ్నోయిస్‌, సెడిమెంట్రీ, మెటమార్ఫిక్‌ రాళ్లుంటాయని, అవి ఎలా ఏర్పడతాయో విద్యార్థులకు వివరించారు. 


కళేబరాల నుంచి ఆయిల్స్‌.. 

 ప్రస్తుతం విదేశాల నుంచి దిగమతి చేసుకుంటున్న క్రూడాయిల్స్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయం చాలా మందికి తెలియదు. గల్ఫ్‌ దేశాల్లోని బావుల్లో నుంచి తీస్తున్న ఆయిల్స్‌ ఒకప్పుడు జీవరాశులు కళేబరాల నుంచి ఉత్పత్తి అవుతున్న విషయం చాలా మందికి తెలియదు. ఏళ్ల క్రితం విపత్తుల సందర్భంగా జీవరాశులు, మొక్కలు, జంతువులు  వేలాదిగా చనిపోయి సముద్ర గర్భంలో చేరాయి. అవన్నీ,  మైక్రో ఫాజిల్స్‌ (ఆర్గానిక్‌ మేటర్స్‌)గా భూమి లోపల ఏర్పడ్డాయి.  శిలాజ ఇంధనాలుగా రూపాంతరం చెందిన వాటిని వెలికి తీసి, కొన్ని కెమికల్స్‌ను కలిపి క్రూడాయిల్‌గా పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా దేశాల నుంచి తీసుకువచ్చిన కొన్ని కూడ్రాయిల్స్‌ను ఎగ్జిబిషన్‌లో ఉంచి వివరిస్తున్నారు. 


శిలాజాలు.. ఖనిజాలతో ఎగ్జిబిషన్‌.. 

పాయకరావుపేటలోని డెక్కన్‌ కెమికల్స్‌లో ఎలక్ర్టికల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కందుల వెంకటేష్‌ వేల ఏళ్ల చరిత్ర కలిగిన శిలాజాలు, ఖనిజాలు, పురాతన నాణేలను సేకరించి ఎగ్జిబిషన్‌లో స్టాల్‌ పెట్టారు.  ఇందులో నాలుగు రకాల శిలాజాలు, పదుల రకాల సబ్‌ పీసెస్‌ ఉన్నాయి. భూమిలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఖనిజాలు, 50 వేల ఏళ్ల కిత్రం ఆది మానవులు వినియోగించిన రాతి పనిముట్లను స్టాల్స్‌లో ఉంచారు. వీటిలో ఆరున్నర కోట్ల సంవత్సరాలు క్రితం నాటి చేప శిలాజం, 52 కోట్ల సంవత్సరాలు నాటి సముద్రపు జీవి   ట్రిలో బైట్‌. ఇది మొట్టమొదటి వెన్నెముక కలిగిన జీవి. అదే విధంగా 450 కోట్ల ఏళ్ల క్రితం భూమి ఏర్పడినప్పుడు  పడిన శకలపు ముక్కను స్టాల్‌లో ఉంచారు. అంతరిక్షంలో ఉన్నప్పుడు 60 మీటర్లున్న ఈ శకలపు ముక్క భూమిపైకి చేరే సరికి అంగుళంగా మారింది. దీనిని విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. ఎనిమిది కోట్ల సంవత్సరాలు నాటి ఆకు శిలాజాలు, జురాసిక్‌ కాలం నాటి తొడెములతో కూడిన చెట్ల శిలాజాలు, సారోపాడ్‌ అనే శాకాహార డైనోసార్‌కు గుడ్లను ప్రదర్శనలో ఉంచారు. ఈ డైనోసార్లు 33 మీటర్లు ఎత్తు పెరిగి, 16 టన్నులు బరువు ఉంటుంది. ఆరున్నర కోట్ల సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ గుడ్డును గుజరాత్‌లో సంపాదించినట్టు వెంకటేష్‌ తెలిపారు. 

 


Read more