రైతు పంటకు లాభసాటి ధర దక్కాలి

ABN , First Publish Date - 2022-11-19T03:12:49+05:30 IST

రైతులకు కావాల్సింది మద్దతు ధర కాదు. పండించిన పంటలకు లాభసాటి ధర. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేసి...

రైతు పంటకు లాభసాటి ధర దక్కాలి

అధికారంలోకి వస్తే స్వామినాథన్‌ సిఫారసులు అమలు చేస్తాం

‘టీడీపీ రైతు పోరుబాట’ సభలో యనమల.. సమస్యలపై రాస్తారోకో

అమలాపురం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘రైతులకు కావాల్సింది మద్దతు ధర కాదు. పండించిన పంటలకు లాభసాటి ధర. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేసి, రైతులకు పూర్తి న్యాయం చేస్తాం’ అని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు చెప్పారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేటలో శుక్రవారం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన రైతు పోరుబాట సభ జరిగింది. యనమల మాట్లాడుతూ జగన్‌ అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం కుదేలయిందన్నారు. వైసీపీ పాలనలో చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసి చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఽ రైతు భరోసా కేంద్రాలు వైసీపీ కేంద్రాలుగా మారాయని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, గొల్లపల్లి సూర్యారావు, బండారు సత్యనారాయణమూర్తి, పీతల సుజాత, పార్టీ నేతలు రెడ్డి అనంతకుమారి, కేఎస్‌ జవహర్‌, తోట సీతారామలక్ష్మి, గన్ని వీరాంజనేయులు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, గోదావరి జిల్లాల టీడీపీ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని, కొనుగోలు చేసిన 48 గంటల్లో సొమ్ములు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రాస్తారోకో చేశారు. ఽధాన్యాన్ని రోడ్డుపై పోసి నిరసన తెలిపారు.

Updated Date - 2022-11-19T03:12:49+05:30 IST

Read more