కలుషిత ఆహారం తిని 40 మంది భవానీలకు అస్వస్థత

ABN , First Publish Date - 2022-10-03T06:29:53+05:30 IST

ల్పాహారం తిన్న సుమారు 40 మంది భవానీ భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరంతా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ తుని ప్రభుత్వ ఆస్పత్రిలో కొందరు, ప్రైవేటు ఆస్పత్రుల్లో మరికొందరు చికిత్సలు పొందుతున్నారు.

కలుషిత ఆహారం తిని 40 మంది భవానీలకు అస్వస్థత
అస్వస్థతకు గురై తుని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భవానీ భక్తులు


- తుని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిక

పాయకరావుపేట రూరల్‌, అక్టోబరు 2 : అల్పాహారం తిన్న సుమారు 40 మంది భవానీ భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరంతా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ తుని ప్రభుత్వ ఆస్పత్రిలో కొందరు, ప్రైవేటు ఆస్పత్రుల్లో మరికొందరు చికిత్సలు పొందుతున్నారు. మండలంలోని గోపాలపట్నంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. గోపాలపట్నం గ్రామంలో రావివలస సత్తిబాబు భవానీ ఇంటి వద్ద శుక్రవారం పూజ ఏర్పాటు చేసి భక్తులకు భిక్ష, వడి పెట్టారు. మధ్యాహ్నం భిక్ష తరువాత రాత్రి పూజ నిర్వహించారు. అనంతరం అల్పాహారంగా ఇడ్లీ, పాలు స్వీకరించారు. అయితే వడి చేసిన తరువాత కొంతమంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో తుని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరినట్టు భవానీలు తెలిపారు. శనివారం, ఆదివారం మరికొంతమంది ఆస్పత్రిల్లో చేరారు. అయితే ఏ ఆహారం తినడం వల్ల అనారోగ్యానికి గురయ్యారో తెలియరావడం లేదు. తుని ఏరియా ఆస్పత్రి వైద్యులు వీరికి వైద్య సేవలందించి, ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు. ఇడ్లీతో పాటు తీసుకున్న కొబ్బరి చట్నీ కలుషితమవ్వడంతో వాంతులు, విరేచనాలు అయి ఉండవచ్చునని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ గూటూరు శ్రీనువాసరావు, సర్పంచ్‌ పన్నీరు పాపారావు వీరిని పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.


Read more