ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం 2.2 లక్షల దరఖాస్తులు

ABN , First Publish Date - 2022-11-08T01:35:55+05:30 IST

ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం సుమారు 2,20,00 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం 2.2 లక్షల దరఖాస్తులు

విశాఖపట్నం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం సుమారు 2,20,00 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఓటు నమోదుకు సోమవారంతో గడువు ముగిసింది. ఈ దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 23వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా వెల్లడించనున్నారు. ముసాయిదాలో పేర్లు లేని వ్యక్తులు, ఇంకా మిగిలిపోయినవారు ఈనెల 23 నుంచి వచ్చేనెల తొమ్మిదో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టరు ఎ.మల్లికార్జున తెలిపారు.

Updated Date - 2022-11-08T01:35:55+05:30 IST

Read more