విశాఖ-హైదరాబాద్‌ బుల్లెట్‌ రైలు ఇవ్వండి

ABN , First Publish Date - 2022-03-16T09:23:03+05:30 IST

విశాఖ-హైదరాబాద్‌ బుల్లెట్‌ రైలు ఇవ్వండి

విశాఖ-హైదరాబాద్‌ బుల్లెట్‌ రైలు ఇవ్వండి

న్యూఢిల్లీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్టణం-హైదరాబాద్‌ మధ్య బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టును చేపట్టాలని వైసీపీ ఎంపీ భీశెట్టి సత్యవతి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. లోక్‌సభలో మంగళవారం  రైల్వే శాఖ పద్దులపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. విశాఖ-హైదరాబాద్‌ వయా విజయవాడ రైళ్లలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందని, మరిన్ని ప్యాసింజర్‌ రైళ్లకు డిమాండ్‌ ఉందని చెప్పారు. కాగా, విశాఖ రైల్వే జోన్‌ కార్యకలాపాలను త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌కు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాలని ప్రతిపాదించారు. 

Read more