-
-
Home » Andhra Pradesh » Visakha District YCP Leaders Harassment bbr-MRGS-AndhraPradesh
-
YCP Leaders Harassment: వైసీపీ వేధింపులకు మరో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-09-11T22:17:14+05:30 IST
వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. వైసీపీ నేతల వేధింపులకు మరో వ్యక్తి మృతి చెందాడు.

విశాఖ: వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. వైసీపీ నేతల వేధింపులకు మరో వ్యక్తి మృతి చెందాడు. విశాఖ జిల్లా (Visakha District) పెందుర్తి ముదపాకలో వైసీపీ నేతల వేధింపులతో సోమేశ్వరరావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సోమేశ్వరరావు కేజీహెచ్ (KGH)లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యులు వైసీపీ నేతలు గణేష్, బాలచందర్‌పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి మూడ్రోజులు గడుస్తున్నా.. వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో మృతుడు స్వగ్రామం గోవిందాపురంలో బంధువుల ఆందోళనకు దిగారు. బాధితులను పరామర్శకు వచ్చిన టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అడ్డుకున్నారు.
ఇటీవల నెల్లూరు జిల్లా కావలిలో దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. వైసీపీ నేతల (YCP Leaders) వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కరుణాకరన్ సూసైడ్ లెటర్ రాశాడు. వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీశ్రెడ్డి (Ketireddy jagadish reddy), సురేశ్రెడ్డి (Suresh reddy)లే కారణమని లేఖలో వెల్లడించాడు. రూ.20 లక్షల అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే మూడేళ్లుగా పట్టనివ్వడం లేదని కరుణాకర్ ఆరోపించాడు. తాను, తన తల్లి వెళ్లి వైసీపీ నేతల కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించలేదని కరుణాకర్ సూసైడ్ లేఖలో ఆవేదన చెందాడు.