Vijayawada: పోలవరం కాలువలోకి దూకిన వృద్ధుడు

ABN , First Publish Date - 2022-04-26T16:45:02+05:30 IST

కృష్ణా జిల్లా నున్న పోలవరం కాలువలోకి ఓ వృద్ధుడు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Vijayawada: పోలవరం కాలువలోకి దూకిన వృద్ధుడు

విజయవాడ: కృష్ణా జిల్లా నున్న పోలవరం కాలువలోకి ఓ వృద్ధుడు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన వృద్ధుడు   గత రాత్రి 12 గంటల సమయంలో పోలవరం కాలువలోకి దూకేశాడు. వృద్ధుడు ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గ్రామానికి  చెందిన శ్రీమన్నారాయణ (55)గా గుర్తించారు. పోలవరం కాలువలో నీళ్ళు తక్కువగా ఉండడంతో శ్రీమన్నారాయణ  బలంగా గాయపడ్డారు. తెల్లవారులు పోలవరం కాలువలోనే వృద్ధుడు కూర్చుండిపోయారు. నున్న స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్‌ అక్కడకు చేరుకుని శ్రీమన్నారాయణను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. 

Read more