మచిలీపట్నంలో టీడీపీ వైభవ యాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-23T18:09:47+05:30 IST

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ వైభవ యాత్ర ప్రారంభమైంది.

మచిలీపట్నంలో టీడీపీ వైభవ యాత్ర  ప్రారంభం

విజయవాడ: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ వైభవ యాత్ర  ప్రారంభమైంది. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. ముందుగా కరగ్రహారం గ్రామంలోని బాబా ఫరీద్ మస్తాన్ అవులియా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వ  వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లతామని తెలిపారు. మూడేళ్ల పాలనలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ యాత్ర ద్వారా ఇంటింటికి వెళ్లి టీడీపీ అండగా ఉంటుందని ప్రజల్లో భరోసా నింపుతామని చెప్పారు. ప్రజల కోసం పాటు పడే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీనే అని స్పష్టం చేశారు. టీడీపీ నలభై యేళ్ల ప్రస్థానంలో ప్రజల కోసం చేసిన మంచిని వివరిస్తామన్నారు. జగన్ ... అప్పుడేం చెప్పారు.. ఇప్పుడెలా మోసం చేశారో అధారాలతో అవగాహన కల్పిస్తామని కొల్లురవీంద్ర పేర్కొన్నారు. 

Read more