-
-
Home » Andhra Pradesh » Vijayawada resident dies in Hyderabad fire telangana suchi-MRGS-AndhraPradesh
-
TS News: హైదరాబాద్ అగ్నిప్రమాదంలో విజయవాడ వాసి మృతి
ABN , First Publish Date - 2022-09-13T19:23:41+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్‌లోని ఓ హోటళ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో విజయవాడ వాసి మృతి చెందాడు.

విజయవాడ: తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో విజయవాడ వాసి మృతి చెందాడు. మృతుడు విజయవాడ రామవరప్పాడుకు చెందిన అల్లాడి హరీష్‌గా గుర్తించారు. ఇటవలే ఈక్విటీఎస్ బ్యాంకులో చేరిన హరీష్... ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళ్లాడు. సికింద్రాబాద్ రూబీ హోటల్‌లో హరీష్ బస చేశాడు. అదే హోటల్ కింద ఉన్న ఈ స్కూటర్ల గోదాములో అగ్నిప్రమాదం జరిగి మంటలు పై అంతస్తుకు వ్యాపించాయి. ప్రమాద సమయంలో హోటల్‌లోనే ఉన్న హరీష్ ప్రాణాలు కోల్పోయాడు. అగ్ని ప్రమాదంలో హరీష్ చనిపోడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎంటెక్ చదివి, ఎంబీఏ చేసిన హరీష్ కొంతకాలం కోస్టల్ బ్యాంకులో పనిచేశాడు.