AP News: దుర్గమ్మ ఆలయంలో అధికారుల మధ్య సమన్వయ లోపం

ABN , First Publish Date - 2022-09-26T14:20:39+05:30 IST

దుర్గగుడి తొలిరోజు ఉత్సవాల్లోనే అధికారుల మధ్య సమన్వయ లోపం తలెత్తింది.

AP News: దుర్గమ్మ ఆలయంలో అధికారుల మధ్య సమన్వయ లోపం

విజయవాడ: దుర్గగుడి తొలిరోజు ఉత్సవాల్లోనే అధికారుల మధ్య సమన్వయ లోపం తలెత్తింది. మొదటి రోజే దుర్గగుడి ఉద్యోగస్తులతో పోలీసుల జగడానికి దిగారు. ద్విచక్ర వాహనాలపై మహా మండపం ప్రవేశ ద్వారం వైపు నుంచి వచ్చే దుర్గగుడి ఉద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. మహా మండపం వద్ద దుర్గగుడి సిబ్బందికి పార్కింగ్ లేదంటూ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు, ఉద్యోగులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.


మరోవైపు దుర్గమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు (Devi sharannavaratri celebrations) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారి స్వర్ణకవచలంకృత దుర్గాదేవిగా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు.  తొలి రోజు అమ్మవారికి  స్నపనాభిషేకం అనంతరం 9 గంటలకు దర్శనానికి అనుమతించనున్నారు. ఉదయం 3 గంటల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆలయం ఘాట్‌రోడ్డు కింద ఉన్నటువంటి అమ్మవారి ఆలయం వద్ద  ఆలయ అర్చకులు భవాని మాలలు వేస్తున్నారు. 

Updated Date - 2022-09-26T14:20:39+05:30 IST