durgamma temple: ఇంద్రకీలాద్రిపై అపచారం

ABN , First Publish Date - 2022-09-28T19:50:14+05:30 IST

దేవీనవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న ఇంద్రకీలాద్రిపై అపచారం చోటు చేసుకుంది.

durgamma temple: ఇంద్రకీలాద్రిపై అపచారం

విజయవాడ: దేవీనవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న ఇంద్రకీలాద్రిపై అపచారం చోటు చేసుకుంది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ ఏజెన్సీ ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తించారు. సెక్యూరిటీ ఇన్‌చార్జ్ చంద్ర మద్యం సేవించి ఆలయంలో విధులకు హాజరయ్యారు. మద్యం మత్తులో ఉన్న సెక్యూరిటీ ఇన్‌చార్జ్... ఈవో భ్రమరాంబ వచ్చినా పట్టించుకోలేదు. దీంతో అతడిపై ఈవో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ ఇన్‌చార్జ్ చంద్రను వైద్య పరీక్షలు కోసం అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా... సెక్యూరిటీ ఏజన్సీపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల నిర్వహణలో అలసత్వం కారణంగా సెక్యురిటీ సిబ్బందిని నిన్న కూడా ఈవో హెచ్చరించారు. అయినప్పటికీ సిబ్బంది తమ తీరును మార్చోకోలేదు. గతంలో కూడా ఇదే సెక్యూరిటీ ఏజన్సీపై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-09-28T19:50:14+05:30 IST