sharannavaratri celebrations: కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి నదీ విహారానికి బ్రేక్

ABN , First Publish Date - 2022-10-04T16:40:45+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దసర శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా కృష్ణానదిలో నిర్వహించే శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల నదీ విహారానికి బ్రేక్ పడింది.

sharannavaratri celebrations: కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి నదీ విహారానికి బ్రేక్

అమరావతి: ఇంద్రకీలాద్రిపై దసర శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా కృష్ణానదిలో నిర్వహించే శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల నదీ విహారానికి బ్రేక్ పడింది. నది ఒడ్డున హంస వాహనం ఉంచి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు పూజాది కార్యక్రమాలు జరుగనున్నాయి. పులిచింతల నుంచి లక్ష క్యూసెక్కుల వరద నీరు రావడంతోనే నదీ విహారం సాధ్యపడదని జల వనరుల శాఖ కలెక్టర్‌కు రిపోర్ట్ పంపింది. దీనిపై కలెక్టర్ ఢిల్లీరావు, ఇరిగేషన్ అధికారి కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతుండడంతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల నదీ విహారం నిర్వహించడం సాధ్యం కాదని తెలిపారు. పులిచింతల నుంచి లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోందన్నారు. మూడు రోజుల పాటు కృష్ణానదిలో ప్రవాహం కొనసాగుతున్నందున స్వామి వార్ల నదీ విహారం చేపట్టలేకపోతున్నామని చెప్పారు. కేవలం దుర్గాఘాట్‌లో హంస వాహనంపై స్వామి వార్ల ఉత్సవ మూర్తులను ఉంచి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. స్వామి వార్ల పూజాది కార్యక్రమాలు తిలకించేందుకు భక్తులకు ప్రకాశం బ్యారేజ్, పున్నమిఘాట్, ఫ్లై ఓవర్, దుర్గాఘాట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వేలాది మంది తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వస్తారు కాబట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీరావు, ఇరిగేషన్ అధికారి కృష్ణమూర్తి వెల్లడించారు. 


Updated Date - 2022-10-04T16:40:45+05:30 IST