App‎ల ద్వారా అప్పు తీసుకున్న మహిళకు వేధింపులు

ABN , First Publish Date - 2022-06-08T03:39:58+05:30 IST

యాప్‎ల ద్వారా అప్పు తీసుకున్న మహిళకు ఉద్యోగుల నుంచి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. మహిళ ఫొటోను అసభ్యకరంగా ..

App‎ల ద్వారా అప్పు తీసుకున్న మహిళకు వేధింపులు

విజయవాడ: యాప్‎ల ద్వారా అప్పు తీసుకున్న మహిళకు ఉద్యోగుల నుంచి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి.  మహిళ ఫొటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి వాట్సాప్ లో పోస్టింగ్ చేశారు. తీసుకున్న అప్పు చెల్లించకపోతే ఈ ఫొటోను ఆమె స్నేహితులకు పంపుతామని బెదిరింపులకు దిగారు. మహిళల మొత్తం 20 యాప్‎ల ద్వారా అప్పు తీసుకున్నారు. 20 వాట్సాప్ నంబర్ల ద్వారా అసభ్యకర మెసేజు పంపారు.  దీంతో ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడిని ఈ తరహాలోనే వేధింపులు గురి చేశారు. రెండు ఘటనలపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. 

Read more