గద్దెరామ్మోహన్ ఇంటికి భారీగా చేరుకున్న పార్టీ శ్రేణులు

ABN , First Publish Date - 2022-03-23T18:19:27+05:30 IST

టీడీపీ నేత గద్దె రామ్మోహన్‌‌ను హౌస్‌ అరెస్ట్‌ చేశారని తెలియడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు గద్దె నివాసానికి చేరుకున్నారు.

గద్దెరామ్మోహన్ ఇంటికి భారీగా చేరుకున్న పార్టీ శ్రేణులు

విజయవాడ: టీడీపీ నేత గద్దె రామ్మోహన్‌‌ను హౌస్‌ అరెస్ట్‌ చేశారని తెలియడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు.. గద్దె నివాసానికి చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా  నినాదాలు చేశారు. జే బ్రాండ్‌ మధ్యాన్ని వెంటనే రూపుమాపాలంటూ మధ్యం సీసాలతో  మహిళలు నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ... స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నా ఖండించాల్సిన స్పీకర్‌ ఏమీ చేయకుండా ఉండిపోయారన్నారు. ముఖ్యమంత్రి కూడా ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ అవహేళనగా సభలో వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ సారా తాగి 26 మంది చనిపోతే సభలో ఈ అంశాన్నీ టీడీపీ చర్చకు తీసుకొస్తే తమ సభ్యులను సస్పెండ్‌ చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల పట్ల కక్షపూరిత దోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇటు సభలోను, అటు బయట కూడా తమ నోరు నొక్కేసి ప్రజా స్వామ్యానికి విరుద్ధంగా వ్యహరిస్తున్నారని ధ్వజమెత్తారు. జంగారెడ్డి గూడెంకు టీడీపీ సభ్యులు వెళ్లి వస్తే ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా? అని ప్రశ్నించారు. ఎక్సైజ్‌ కమిషన్‌ కార్యాలయానికి వెళితే పోలీసులకు ఎందుకు ఉలికిపాటు అంటూ గద్దె రామ్మోహన్ ప్రశ్నించారు. 

Read more