ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చ జరపాలని కోరాం: విజయసాయి

ABN , First Publish Date - 2022-07-17T23:27:44+05:30 IST

అఖిలపక్ష సమావేశంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో విజయసాయి మాట్లాడారు.

ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చ జరపాలని కోరాం: విజయసాయి

ఢిల్లీ: అఖిలపక్ష సమావేశంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో విజయసాయి మాట్లాడారు. జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. ఏపీలో వరద పరిస్థితులపై పార్లమెంట్‌లో చర్చించి ఆర్థిక సహాయం అందించాలని కేంద్రాన్ని కోరామన్నారు. అలాగే ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చ జరపాలని కోరామన్నారు. 

Read more