-
-
Home » Andhra Pradesh » vidadala rajini ap news chandrababu ycp chsh-MRGS-AndhraPradesh
-
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం: మంత్రి రజనీ
ABN , First Publish Date - 2022-09-12T00:23:43+05:30 IST
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం: మంత్రి రజనీ

విజయవాడ: అమరావతి పేరుతో చేపడుతున్న పాదయాత్ర వెనుక చంద్రబాబు ఉన్నారని మంత్రి విడుదల రజనీ ఆరోపించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాదయాత్ర చేయలేరు.. లోకేష్ చేసిన ఉపయోగం లేదు.. అందుకే అక్కడ ఉన్న ప్రజలను రెచ్చగొట్టి పాదయాత్ర చేసేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, జగన్మోహన్ రెడ్డి, వెనకే ప్రజలు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. అమరావతి రాజధాని కాదు, అని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. అమరావతి శాసన రాజధాని, విశాఖ పాలనా రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని మూడు రాజధానులతో పాటుగా అభివృద్ధి అనేది తమ ప్రభుత్వ విధానమన్నారు. పాదయాత్రలో, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు.