‘దొంగల్లాగా దొడ్డిదారిన వెళ్లడం ఏమిటి?’

ABN , First Publish Date - 2022-10-01T21:57:04+05:30 IST

‘దొంగల్లాగా దొడ్డిదారిన వెళ్లడం ఏమిటి?’

‘దొంగల్లాగా దొడ్డిదారిన వెళ్లడం ఏమిటి?’

విశాఖపట్నం: చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీని పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతు నొక్కాలని, జగన్ ఆలోచన మారాలని ఆయన సూచించారు. భయపెట్టాలని చూస్తే భయపడే వారు ఎవరూ లేరని సవాల్ విసిరారు. మీరు ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే, టీడీపీ అంత పైకి వస్తుందన్నారు. పోలీసులు చట్టబద్ధంగా పని చేయాలి.. దొంగల్లాగా దొడ్డిదారిన వెళ్ళకూడదన్నారు. ఏదైనా ఉంటే నోటీసులిచ్చి వివరణ కోరాలని సూచించారు. 


Read more