వారాహి.. టీఎస్‌ 13 ఈఎక్స్‌ 8384

ABN , First Publish Date - 2022-12-13T03:16:31+05:30 IST

కొద్దిరోజులుగా ఏపీలో వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల మంటలకు కారణమైన పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచార వాహనం ‘వారాహి’ రిజిస్ట్రేషన్‌ పూర్తయింది

వారాహి.. టీఎస్‌ 13 ఈఎక్స్‌ 8384

పవన్‌ ప్రచార వాహనానికి 9నే రిజిస్ట్రేషన్‌ పూర్తి

హైదరాబాద్‌/సిటీ, డిసెంబరు 12: కొద్దిరోజులుగా ఏపీలో వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల మంటలకు కారణమైన పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచార వాహనం ‘వారాహి’ రిజిస్ట్రేషన్‌ పూర్తయింది! వైసీపీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నట్లు ఆ వాహనం రంగు ఆర్మీ వాహనాలకు వాడే ఆలివ్‌ గ్రీన్‌ కాదని.. ఎమరాల్డ్‌ గ్రీన్‌ అని తెలంగాణ రవాణా శాఖ తేల్చి, టోలీచౌకీ రవాణా శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసింది. ఆ వాహనానికి టీఎస్‌ 13 ఈఎక్స్‌ 8384 అనే నంబరు కేటాయించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈనెల 9న హైదరాబాద్‌ టోలీచౌకీ ఆర్టీఏ కార్యాలయం నుంచి ఈ రిజిస్ట్రేషన్‌ జరిగిందని ఆయన వివరించారు. వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలనూ పరిశీలించామని, వాహనం రంగును ఎమరాల్డ్‌ గ్రీన్‌గా నిర్ధారించి ఆర్సీ మీద ఆ వివరాలు ముద్రించామని మంత్రి వెల్లడించారు. వాహనాల రంగులకు కోడ్‌లు ఉంటాయని.. భారత ఆర్మీ ఉపయోగించే కలర్‌ కోడ్‌, ఈ వాహనం కలర్‌ కోడ్‌ వేర్వేరుగా ఉన్నాయని, దీని రంగు నిబంధనలకు లోబడే ఉందని స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-13T03:16:31+05:30 IST

Read more