ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్ధి చిన్ని కుమారి

ABN , First Publish Date - 2022-10-08T09:20:20+05:30 IST

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్ధి చిన్ని కుమారి

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్ధి చిన్ని కుమారి

అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గాడు చిన్నికుమారి లక్ష్మి పేరును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంపిక చేసినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గాడు చిన్నికుమారి లక్ష్మి ప్రస్తుతం గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 2వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఉన్నారు. 2008-10లో భీమిలి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన చిన్నికుమారి లక్ష్మి.. రాష్ట్ర తెలుగు మహిళా విభాగంలో పని చేశారు. నాగవంశీయుల(బీసీ) వర్గానికి చెందిన చిన్నికుమారి భర్త అప్పల నాయుడు 1986నుంచి టీడీపీలో ఉన్నారు. విశాఖ జిల్లా టీడీపీలో వివిధ పదవులు నిర్వహించారు. 


Read more