TTD: అమాత్యుల సేవలో తరిస్తున్న టీటీడీ

ABN , First Publish Date - 2022-08-15T21:21:01+05:30 IST

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దంటూనే అమాత్యుల సేవలో టీటీడీ తరిస్తోంది. సాధార‌ణ రోజుల్లో కూడా శ్రీవారిని ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో వ‌స్తూ ఉంటారు.

TTD: అమాత్యుల సేవలో తరిస్తున్న టీటీడీ

తిరుమల: వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దంటూనే అమాత్యుల సేవలో టీటీడీ తరిస్తోంది. సాధార‌ణ రోజుల్లో కూడా శ్రీవారిని ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో వ‌స్తూ ఉంటారు. ఇక నాలుగైదు రోజులు వరుసగా సెల‌వులు వ‌స్తే భ‌క్తుల ర‌ద్దీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి రెండు రోజులు ప‌డుతోంది. రద్దీ వల్ల భక్తులు రావ‌ద్ద‌ని ప‌రోక్షంగా టీటీడీ అధికారులు సూచిస్తూ ఉంటారు. ఈ నిబంధనలు సాదారణ భక్తులకు మాత్రమేనని టీటీడీ మరోసారి నిరూపించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 21 వరకు విఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అయినా మంత్రి ఉషశ్రీ చరణ్ (Ushashri Charan) ఒత్తిడికి తలొగ్గి 50 బ్రేక్ దర్శనం టికెట్లతో పాటు.. 10 సుప్రభాతం టిక్కెట్లను టీటీడీ జారీ చేసింది. 50 మంది అనుచరులతో ఉషశ్రీచరణ్ శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి భక్తుల కష్టాలను మంత్రి పట్టించుకోలేదు. భక్తులు (Devotees) రోజుల తరబడి క్యూలైన్‌లో వేచి ఉన్నా ఖాతరుచేయలేదు. టీటీడీ అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు.


వరుసగా సెలవులు రావడం తిరుమలకు భక్తులు పొటెత్తారు. దీంతో ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. సామన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆగస్టు (August) 21 వరకు సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా వీఐపీ బ్రేక్, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేశారు. అయినా మంత్రి ఉషశ్రీ చరణ్ తన పలుకుబడితో బ్రేక్ దర్శనంలో శ్రీవారి దర్శించుకున్నారు. మంత్రి నిబంధలను ఉల్లంఘి శ్రీవారిని దర్శించుకోవడంపై పలువురు విమర్శలు సంధిస్తున్నారు. 


గత నెలలో మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) తిరుమల శ్రీవారి ఆలయంలో హల్‌చల్‌ చేశారు. దాదాపు 150మంది అనుచరులతో ప్రొటోకాల్‌ దర్శనానికి వెళ్లి విమర్శల పాలయ్యారు. సాధారణంగా వీఐపీ(VIP)తో పాటు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రొటోకాల్‌ దర్శనాన్ని కల్పిస్తారు. అయితే మంత్రి మాత్రం తన అనుచరులందరికీ ప్రొటోకాల్‌ దర్శనాలు కావాల్సిందేనంటూ పట్టుబట్టడంతో టీటీడీ (TTD) నిబంధనలు పక్కన పెట్టి మరీ ప్రొటోకాల్‌ దర్శనాలను చేయించింది. అప్పటికే క్యూలైన్‌లో వేచివున్న సామాన్య భక్తులు ప్రభుత్వంతో పాటు టీటీడీపై తీవ్రస్థాయిలో విమర్శల గుప్పించారు. ప్రజాసేవలో తరించాల్సిన మంత్రులు ఇలా సామాన్యులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించడం సరికాదంటూ మండిపడ్డారు.

Updated Date - 2022-08-15T21:21:01+05:30 IST