మంగళగిరి ఎయిమ్స్‌లో కేంద్రమంత్రి Bharti Praveen Pawar పర్యటన

ABN , First Publish Date - 2022-06-11T16:24:52+05:30 IST

జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ పర్యటించారు. ఆసుపత్రిలో సదుపాయాలను పరిశీలించారు.

మంగళగిరి ఎయిమ్స్‌లో కేంద్రమంత్రి Bharti Praveen Pawar పర్యటన

గుంటూరు: జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్(Bharti Praveen Pawar) పర్యటించారు. ఆసుపత్రిలో సదుపాయాలను పరిశీలించారు. ఆయుష్మాన్ భారత్ గురుంచి ఆసుపత్రిలో ఎక్కడా డిస్ప్లే బోర్డు  కనిపించకపోవడంతో... ఎయిమ్స్ సూపరిండెండెంట్ ముఖేష్ త్రిపాఠీని కేంద్రమంత్రి నిలదీశారు. వైద్యం అందుతున్న తీరుపై రోగుల నుంచి సమాచారం సేకరించారు. వైద్యులు మాట్లాడే హిందీ, ఇంగ్లీషు తమకు అర్థం కావడం లేదని.. రోగులు చెప్పేది డాక్టర్‌లకు అర్ధం కావడం లేదంటూ కేంద్రమంత్రి పవార్‌కు ఫిర్యాదులు వచ్చాయి. 

Read more