మ్యాచింగ్‌ గ్రాంట్‌కే నిధుల్లేవు

ABN , First Publish Date - 2022-09-19T10:07:11+05:30 IST

‘‘రైల్వే ప్రాజెక్టులకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గతి లేదు. కానీ మూడు రాజధానులు నిర్మిస్తామనడం హాస్యాస్పదం’’ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం వైఎస్సార్‌ కడప జిల్లా వేంపల్లెలో మీడియా

మ్యాచింగ్‌ గ్రాంట్‌కే నిధుల్లేవు

మూడు రాజధానులు నిర్మిస్తారా?: తులసిరెడ్డి


వేంపల్లె, సెప్టెంబరు 18: ‘‘రైల్వే ప్రాజెక్టులకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గతి లేదు. కానీ మూడు రాజధానులు నిర్మిస్తామనడం హాస్యాస్పదం’’ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం వైఎస్సార్‌ కడప జిల్లా వేంపల్లెలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులు భరించే షరతుతో 2006-07లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషితో మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం కడప-రాయచోటి-మదనపల్లె-బెంగుళూరు నూతన బ్రాడ్‌గేజ్‌ రైలు మార్గాన్ని మంజూరు చేసిందన్నారు. మొత్తం  268 కిలోమీటర్ల పొడవుకు గాను ఇప్పటి వరకు 21.30 కిలోమీటర్లు పూర్తయిందన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఒక్కపైసా కూడా విడుదల చేయలేదన్నారు. దీంతో రైల్వేశాఖ పనులు నిలిపివేసిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మూడు రాజధానులు నిర్మిస్తామని వైసీపీ నాయకులు బడాయి మాటలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ తెడ్డు గడపదాటడం లేదన్నట్లుంది వైసీపీ తీరు అని అన్నారు. 

Updated Date - 2022-09-19T10:07:11+05:30 IST