TTD: 12 గంటలు శ్రీవారి ఆలయం మూత

ABN , First Publish Date - 2022-09-08T02:53:53+05:30 IST

సూర్యగ్రహణం (అక్టోబరు 25న), చంద్రగ్రహణం (నవంబరు 8న) కారణంగా ఆయా రోజుల్లో తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు

TTD: 12 గంటలు శ్రీవారి ఆలయం మూత

తిరుమల: సూర్యగ్రహణం (అక్టోబరు 25న), చంద్రగ్రహణం (నవంబరు 8న) కారణంగా ఆయా రోజుల్లో తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు 12 గంటలపాటు మూసివేస్తారు. అక్టోబరు 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆ రోజున ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ సందర్భంగా బ్రేక్‌ దర్శనం, శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వృద్ధులు, దివ్యాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, రక్షణ సిబ్బంది, ఎన్‌ఆర్‌ఐల దర్శనంతోపాటు ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ (TTD) రద్దు చేసింది. ఆరోజున మిగిలిన సమయంలో కేవలం సర్వదర్శనం భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. నవంబరు 8న మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఆరోజున ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. ఈ సందర్భంగా కూడా ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేసి.. ఆరోజున మిగిలిన సమయంలో సర్వదర్శన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించేలా టీటీడీ ప్రణాళికలు రూపొందించుకుంది. 

Updated Date - 2022-09-08T02:53:53+05:30 IST