ఎన్టీఆర్‌ ఫొటో తీసి... చంద్రబాబు ఫొటో

ABN , First Publish Date - 2022-09-28T08:39:19+05:30 IST

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏటా టీటీడీ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇం దులో మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, మాజీ గవర్నర్లు, మాజీ సీఎంలతో పాటు ప్రస్తుతం

ఎన్టీఆర్‌ ఫొటో తీసి... చంద్రబాబు ఫొటో

పేరు మాత్రం అలాగే ఉంచారు.. టీటీడీ ఎగ్జిబిషన్‌లో వి‘చిత్రం’


తిరుమల, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏటా టీటీడీ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇం దులో మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, మాజీ గవర్నర్లు, మాజీ సీఎంలతో పాటు ప్రస్తుతం పదవిలో ఉన్న వారి ఫొటోలు ఏర్పాటు చేస్తా రు. ఈసారి ఎగ్జిబిషన్‌లో మొదట మాజీ సీఎం చంద్రబాబు ఫొటో కన్పించలేదు. ఇది చర్చనీయాంశంగా మారడంతో కాసేపటికి ‘చిత్రం’ చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌ ఫొటోను తొలగించి.. ఆ స్థానంలో చంద్రబాబు ఫొటోను పెట్టారు. కానీ కింద పేరును మాత్రం అలాగే వదిలేశారు. 

Read more