శ్రీవారి దర్శన వేళల్లో మార్పులు చేసిన టీటీడీ

ABN , First Publish Date - 2022-09-27T14:13:31+05:30 IST

తిరుమల శ్రీవారి దర్శన వేళల్లో (Visiting timings) తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మార్పులు చేసింది.

శ్రీవారి దర్శన వేళల్లో మార్పులు చేసిన టీటీడీ

Tirumala : తిరుమల శ్రీవారి దర్శన వేళల్లో (Darshan timings) తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మార్పులు చేసింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా.. స్వామివారి దర్శన వేళల్లో మార్పులు చేసింది. నేటి నుంచి అక్టోబర్ 5 వరకూ శ్రీవారి ఆలయంలో.. ప్రత్యేక దర్శనాలు (Special Visions) అన్నింటినీ టీటీడీ రద్దు చేసింది. ఉదయం నుంచి రాత్రి వరకు కేవలం సర్వదర్శనం గుండానే.. భక్తులను స్వామివారి దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. కాగా.. నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను ఆలయ పూజారులు ప్రారంభించనున్నారు. అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. ప్రభుత్వం తరపున సీఎం జగన్ (AP CM Jagan) స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై భక్తులకు.. కోనేటి రాయుడు దర్శనం ఇవ్వనున్నారు. కోనేటిరాయుడు వాహనసేవలో సీఎం జగన్ పాల్గొననున్నారు. బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు (TTD Officials) పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2022-09-27T14:13:31+05:30 IST