‘ఎన్ని పార్టీలు వచ్చినా.. జగన్ పాలన వైపే ఏపీ ప్రజల చూపు’

ABN , First Publish Date - 2022-10-06T03:40:23+05:30 IST

శ్రీనివాస సేతు రెండో దశ బ్రిడ్జిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కొత్త పార్టీపై ఆయన స్పందించారు. చాలా ...

‘ఎన్ని పార్టీలు వచ్చినా.. జగన్ పాలన వైపే ఏపీ ప్రజల చూపు’

తిరుపతి: శ్రీనివాస సేతు రెండో దశ బ్రిడ్జిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కొత్త పార్టీపై ఆయన స్పందించారు. చాలా పార్టీలు వస్తుంటాయని.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దామన్నారు. ఎవరు పోటీ చేసినా ఏపీ ప్రజలు జగన్‌ పాలన వైపే చూస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించారు. టీఆర్ఎస్‌గా ఉన్న పార్టీని బీఆర్ఎస్‌గా మార్చారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పోటీ చేస్తుందని కేసీఆర్ తెలిపారు. ప్రధానంగా ఏపీపైనే  కేసీఆర్ ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ టీడీపీలో పని చేశారు. అప్పటి పరిచయాలతో ఏపీలో కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఏపీలోని పలువురితో టచ్‌లో ఉన్నారు. కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటించడంతో ఏపీలో పలుచోట్ల సంబురాలు జరుపుకున్నారు. కేసీఆర్ కొత్త పార్టీని ఆహ్వానించారు. అయితే ప్రధాన పార్టీలు మాత్రం కేసీఆర్ పార్టీ వల్ల రాష్ట్రంలో ఒరిగేదేమి ఉండదని కొట్టి పారేస్తున్నారు. అటు వైసీపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. 

Updated Date - 2022-10-06T03:40:23+05:30 IST